National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం.. ఉత్తమ తెలుగు చిత్రం ఇదే..

by Satheesh |   ( Updated:2022-07-22 16:22:34.0  )
Colour Photo Movie Gets Best Telugu Film Award Of National Film Awards
X

దిశ, సినిమా: Colour Photo Movie Gets Best Telugu Film Award Of National Film Awards| 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఇక ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తాచాటడం విశేషం. కాగా ఉత్తమ తెలుగు చిత్రంగా 'కలర్ ఫోటో' ఎంపికైంది. ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో 'నాట్యం', ఉత్తమ సంగీతం కేటగిరీలో 'అలా వైకుంఠపురంలో' చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. ఇక ఉత్తమ నటుడిగా అవార్డును ఇద్దరు పంచుకోనుండగా.. ఈ ఏడాది మొత్తం 30 భాషల్లో 305 ఫీచర్ ఫిల్మ్స్ ఎంట్రీకి రాగా నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 148 చిత్రాలు (20 భాషల్లో) స్క్రీనింగ్‌కు వచ్చినట్లు జ్యూరీ మెంబర్స్ తెలిపారు. ఈ ఏడాది అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్ అవార్డు, ఫీచర్ ఫిల్మ్ (28 కేటగిరీలు), నాన్ ఫీచర్ ఫిల్మ్స్ (22 కేటగలీలు), బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ కేటగిరీ అవార్డులు ప్రకటించారు.

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: సురారై పొట్రు

ఉత్తమ దర్శకుడు: సచి (అయ్యప్పనుమ్ కోషియుమ్)

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: తానాజీ

ఉత్తమ నటుడు: సూరరై పొట్రు చిత్రానికి సూర్య, తానాజీ చిత్రానికి అజయ్ దేవగన్

ఉత్తమ నటి: అపర్ణా బాలమురళి (సురారై పొట్రు)

ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: అనీష్ మంగేష్ గోసావి

ఉత్తమ సహాయ నటుడు: బిజు మీనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్)

ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి, శివరంజనియుమ్

ఉత్తమ స్క్రీన్ ప్లే: షాలిని ఉషా నాయర్, సుధా కొంగర(సురారై పొట్రు)

ఉత్తమ డైలాగ్ రైటర్: మడోన్ అశ్విన్(మండేలా)

ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యా రాజు (నాట్యం)

ఉత్తమ మేకప్: టీవీ రాంబాబు (నాట్యం)

ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) : తమన్ (అలా వైకుంఠపురంలో)

ఉత్తమ సంగీత దర్శకత్వం(నేపథ్య సంగీతం): జీవీ ప్రకాష్ (సురారై పొట్రు)

ఉత్తమ నేపథ్య గాయకుడు: రాహుల్ దేశ్‌పాండే, ఎం వసంతరావు

ఉత్తమ నేపథ్య గాయని: నాంచమ్మ (అయ్యప్పనుమ్ కోషియుమ్)

ఉత్తమ సాహిత్యం: సైనా, మనోజ్ ముంతాషిర్

ఉత్తమ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): జాబిన్ జయన్, డొల్లు

ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్): అన్మోల్ భావే, ఎంఐ వసంతరావు

ఉత్తమ ఆడియోగ్రఫీ (ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్‌కి రీ-రికార్డిస్ట్): విష్ణు గోవింద్, శ్రీ శంకర్ మాలిక్

ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిజాత్రిక్, సుప్రతిమ్ భోల్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: నచికేత్ బార్వే, మహేష్ షెర్లా (తానాజీ)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అనీస్ నాడోడి, కప్పెల

ఉత్తమ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, శివరంజినియుమ్ ఇన్నుమ్ సిల పెంగళం

ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ: రాజశేఖర్, మాఫియా శశి, సుప్రీమ్ సుందర్ (అయ్యప్పనుమ్ కోషియుమ్)

ఉత్తమ తెలుగు చిత్రం: కలర్ ఫోటో

ఉత్తమ హిందీ చిత్రం: తుల్సిదాస్ జూనియర్

ఉత్తమ కన్నడ చిత్రం: డొల్లు

ఉత్తమ మలయాళ చిత్రం: తింకల్‌జా నిశ్చయం

ఉత్తమ తమిళ చిత్రం: శివరంజినియుమ్ ఇన్నుమ్ సిల పెంగళం

ఉత్తమ మరాఠీ చిత్రం: గోష్ట ఎకా పైతానిచి

ఉత్తమ బెంగాలీ చిత్రం: అవిజాట్రిక్

ఉత్తమ బాలల చిత్రం: సుమి

ఉత్తమ హర్యాన్వి చిత్రం: దాదా లక్ష్మీ

ఉత్తమ దిమాసా చిత్రం: సంఖోర్

ఉత్తమ తుళు చిత్రం: జీతిగే

ఉత్తమ అస్సామీ చిత్రం: ది బ్రిడ్జ్

పర్యావరణ పరిరక్షణపై ఉత్తమ చిత్రం: టాలెండండా

సామాజిక సమస్యపై ఉత్తమ చిత్రం: ఫ్యునెరల్

ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డు: మండేలా

ఇది కూడా చదవండి: లైంగిక వేధింపులు భరించలేక తప్పుకున్నా.. సీనియర్ నటి

Advertisement

Next Story

Most Viewed