రంగుల్లో.. రొమాంటిక్ షేడ్స్

by Mahesh |   ( Updated:2022-05-04 08:24:17.0  )
రంగుల్లో.. రొమాంటిక్ షేడ్స్
X

దిశ, ఫీచర్స్ : పరిసరాలు, ప్రకృతి మనుషుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని తెలుసు. కానీ నివాసాలు, కార్యాలయం గోడలపై ఉన్న రంగులు సైతం ప్రభావం చూపిస్తాయన్న సంగతి చాలా మందికి తెలియదు. మానసిక నిపుణుల ప్రకారం.. గోడలపై రంగుల్లో కొన్ని మెదడు తరంగాలను ఉత్తేజపరిస్తే, మరికొన్ని అనారోగ్యాన్ని కూడా దూరం చేస్తాయని స్పష్టమైంది. ఒత్తిడి కలిగించే హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించి, భావోద్వేగాలను అదుపులో ఉంచే శక్తి ఈ రంగులకు ఉందని ఎన్నో అధ్యయనాలు రుజువు చేశాయి. అయితే సంతోషం, ప్రశాంతత, రొమాంటిక్ మూడ్‌ను పెంచేందుకు ఇంటీరియర్‌కు ఎలాంటి రంగులు ఉపయోగించాలి? అవి ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం..

ప్రశాంతమైన మనస్సు..

బ్లూ కలర్‌ ఇష్టపడేవారిలో చాలామంది ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతమైన నిద్ర చేరుకోవడంతో పాటు వారంలో మూడు నాలుగు సార్లు శృంగారంలో పాల్గొంటారు. ఈ రంగు ఆకాశం, సముద్ర అందాలను గుర్తుచేయడమే కాక రిలాక్స్‌డ్ స్పేస్‌ను సృష్టిస్తుంది. అయితే మీరు సరైన షేడ్స్ ఎంచుకున్నారో లేదో ముందుగా నిర్ధారించుకోవడం ముఖ్యం. ముదురు రంగు షేడ్స్ ప్రశాంతత కలిగించడంలో ఉత్తమంగా పనిచేస్తాయి. మీ గది చల్లని బీచ్ వైబ్స్‌తో ప్రతిబింబించాలని కోరుకుంటే.. సీలింగ్స్ నుంచి వాల్ డిజైన్స్ వరకు, కర్టెన్స్ నుంచి ఫర్నిచర్ వరకు దాదాపు ప్రతి ఎలిమెంట్‌లో నీలం రంగును చేర్చాలి. దీనికి క్రీమ్, తెలుపు రంగును జత చేసుకోవాలి.

శృంగార వాతావరణం కోసం..

పర్పుల్ కలర్‌ను ఇష్టపడేవారు శృంగార విషయంలో స్వార్థపరులుగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. భాగస్వామి భావోద్వేగాలను పట్టించుకోకుండా ఖాళీ దొరికితే చాలు సెక్స్‌ చేసేందుకు ఆరాటపడతారని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా యువ జంటలు ఈ రంగును బాగా ఇష్టపడతారు. ఇక కొత్త దంపతులకు ఈ రంగు ఉత్తేజాన్నిస్తుంది. అంతేకాదు పర్పుల్ కలర్ తప్పులు చేయకుండా కంట్రోల్ చేస్తుందని, ఇద్దరి మధ్య అట్రాక్షన్ పెంచడంతో పాటు రొమాంటిక్ మూడ్ సృష్టిస్తుంది. పాజిటివ్ డ్రీమ్స్‌ను ప్రేరేపిస్తుంది. అలాగే క్రియేటివిటీ పెంచడంలోనూ ఈ రంగులు సాయపడతాయని.. బయట నుంచి తెచ్చుకున్న చిరాకు, కోపాన్ని కంట్రోల్ చేసి శృంగారం వైపు మళ్లించేలా ప్రోత్సహిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లాస భరితంగా..

సాధారణంగా వంటశాల, భోజనాల గదులు, హాల్, బాత్‌రూమ్స్‌కు పసుపు రంగును సిఫార్సు చేస్తారు. ఎందుకంటే సహజ కాంతి లక్షణాలు కలిగిన ఈ రంగు గదిని ప్రకాశవంతంగా, ఉల్లాసంగా చేస్తుంది. అలాగే ఈ రంగు ఇష్టపడే వ్యక్తుల్లో శృంగార కోరికలు కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ ఎక్కువ ఆకలి కలిగిస్తుంది. పిల్లల బెడ్‌రూమ్ ఉల్లాసభరితంగా కనిపించేందుకు దీనిని ఉపయోగించవచ్చు. లేత పసుపు రంగు ఇంటీరియర్స్‌కు తాజాదనాన్ని, కొత్తదనాన్ని ఇవ్వడంలో గొప్పగా పనిచేస్తుంది. ఇందులో బటర్‌క్రీమ్, సన్ ఫ్లవర్ షేడ్స్ ఎంచుకోవాలి. బ్రౌన్ క్యాబినెట్స్ లేదా ఇతర ఫర్నిచర్ పుష్కలంగా ఉన్న గదికి ఈ రంగులు మరింత అందాన్నిస్తాయి. ముఖ్యంగా ముభావంగా ఉండే వ్యక్తుల గదిలో ఈ కలర్ వాడకం మంచి ఫలితాలనిస్తుంది.

స్ఫూర్తి కలిగించేందుకు:

ఆకుపచ్చ రంగులో మనిషిని ఓదార్చే లక్షణాలుంటాయి. చూడంగానే ఒత్తిడి దూరమై కళ్లకు విశ్రాంతి భావన కలుగుతుంది. అందుకే ఆపరేషన్ థియేటర్స్‌లో డాక్టర్లు ఇదే రంగు దుస్తులు ధరిస్తారు. నిరంతరం పచ్చదనాన్ని చూడటం వల్ల మెదడుకు ప్రశాంతత చేకూరుతుంది. గ్రీన్ కలర్‌కు ఆరెంజ్ మిక్స్ చేస్తే సరైన సమతుల్యత ఏర్పడుతుంది. ఇందులో సేజ్, లైమ్, ఆలివ్ గ్రీన్ వంటి రకాలతో పాటు మింట్ గ్రీన్ వంటి రంగులు పుష్కలంగా లభిస్తాయి. ఈ రంగు ఇష్టపడే వ్యక్తులు పడకగదిలో భాగస్వామిపై విపరీతమైన ప్రేమ చూపిస్తారని వెల్లడైంది.

సానుకూల శక్తిని అందిస్తాయి..

ఆరెంజ్ కలర్‌ ఇష్టపడే వ్యక్తులు ఫాంటసీని కోరుకుంటారు. ఇంటి గోడలపై ఈ రంగు సానుకూల వైఖరిని ప్రేరేపిస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. కాబట్టి కిచెన్, డైనింగ్ రూమ్స్‌కు ఈ రంగునే సిఫార్సు చేస్తారు. పైగా దీనికి క్షణాల్లోనే మూడ్‌ను మార్చే శక్తి ఉంటుంది.

శాంతికి చిహ్నం..

తెలుపు రంగు గదిని శుభ్రంగా ఉంచడం తో పాటు విశాలంగా కనిపించేలా చేస్తుంది. ఈ స్వచ్ఛమైన రంగులో మనిషికి సాంత్వన కలిగించే లక్షణాలు ఉన్నాయి. గది అలంకరణ కోసం లేత గోధుమరంగు యాడ్ చేస్తే అద్భుతంగా కనిపిస్తుంది. ఇక తెలుపు రంగు ఇష్టపడేవారికి శృంగారంలో మొహమాటం తో పాటు సిగ్గు ప్రదర్శిస్తారు.

Advertisement

Next Story

Most Viewed