- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలికల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ నిఖిల
దిశ, పరిగి: విద్యార్థులను నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. వికారాబాద్జిల్లాలోని పరిగి మున్సిపల్పరిధిలోని మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ బాలికల పాఠశాలను శనివారం జిల్లా కలెక్టర్ నిఖిల పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో తిరిగి వసతులను పరిశీలించారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. పాఠశాలలో డైనింగ్ హాల్, కిచెన్ షెడ్ ల నిర్మాణము చేపట్టాలని తెలిపారు. వెంటనే ఇంజనీరింగ్ అధికారిని సంప్రదించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు. బాలికల ఉన్నత పాఠశాలను వేరుగా ఉంచి అందులో ఉన్న ప్రాథమిక పాఠశాలను ప్రక్కనే ఉన్న బాలుర ప్రాథమిక పాఠశాల భవనంపై నిర్మించేందుకు గల సౌకర్యాన్ని పరిశీంచాలని డీఈఓకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు. అనంతరం హైస్కుల్ పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట డీఈఓ రేణుకాదేవి, తహశీల్దార్విద్యాసారగ్రెడ్డి, పరిగి మున్సిపల్చైర్మన్ముకుంద అశోక్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుల కృష్ణా రెడ్డి, కనకాచారి, నాయకులు బేతు ప్రవీణ్కుమార్రెడ్డి, ఉపాధ్యాయులు కిష్టయ్య, పాఠశాలల చైర్మన్లు బాలానగర్ రాజు, వెంకటేష్, దోమ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.