కేసీఆర్.. నిరుద్యోగ భృతికి ఎంత కేటాయించారు.. కొండా సూటి ప్రశ్న

by Nagaya |
కేసీఆర్.. నిరుద్యోగ భృతికి ఎంత కేటాయించారు.. కొండా సూటి ప్రశ్న
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ సాయం చేసేందుకు సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి పథకాన్ని తీసుకొస్తామని గత ఎన్నికల సమయంలో ప్రకటించారు. అయితే, సీఎం కేసీఆర్ రెండవ సారి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఈ పథకం అమలులోకి రాలేదు. అయితే, ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించి నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని నాయకులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో గత మూడేళ్లుగా ఇటు ఉద్యోగ నోటిఫికేషన్లు అటు నిరుద్యోగ భృతి రాక రాష్ట్రంలోని యువత ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉద్యోగాలు రావేమో అని పదుల సంఖ్యలో నిరుద్యోగ యువత బలవన్మరణాలకు పాల్పడ్డారు.

ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, నిరుద్యోగ జేఏసీ నాయకులు ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఈ ఆర్థిక బడ్జెట్ లో నిరుద్యోగ భృతితో పాటు ఉద్యోగ నోటిఫికేషన్లపై ప్రకటన విడుదల చేస్తారని నిరుద్యోగులంతా ఆశించారు. కానీ బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా నిరుద్యోగ భృతిపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ద్వారా నెలకు రూ.3016 చెల్లించేందుకు ఎంత నిధులు కేటాయించారని ట్వీట్ చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ పై నిరుద్యోగులంతా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed