సీఎం కేసీఆర్ వారిని మోసం చేస్తున్నారు: ఎల్లంకి మహేష్

by Satheesh |
సీఎం కేసీఆర్ వారిని మోసం చేస్తున్నారు: ఎల్లంకి మహేష్
X

దిశ, భువనగిరి రూరల్: రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కేసీఆర్ కేవలం 91,000 ఉద్యోగాలు మాత్రమే అసెంబ్లీలో ప్రకటించి యువతను మోసం చేస్తున్నారని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ అన్నారు. శుక్రవారం వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ఏఐవైఎఫ్ మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయాలని, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని, మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ సుదర్శన్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయి కుమార్, మండల సహాయ కార్యదర్శి సలిగంజి ప్రదీప్ కుమార్, మెట్టు లక్ష్మణ్, ఎల్లంకి చంద్ర శేఖర్, మామిడికాయల నరేష్, సలిగంజి కృష్ణకుమార్, రచ్చ రవిరాజు, మెడి దేవేందర్, రుద్రపల్లి రవి, రుద్రపల్లి రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలిగంజి వీరస్వామి, సీపీఐ సీనియర్ నాయకులు ఎలాగందుల అంజయ్య, తాలూకా యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story