Cleaning Tips: దీపావళికి మీ ఇంటిని మొత్తం క్లీన్ చేస్తున్నారా? ఇలా చేస్తే ఇల్లు తళతళ మెరవడం ఖాయం..!

by Anjali |   ( Updated:2024-10-27 10:09:59.0  )
Cleaning Tips: దీపావళికి మీ ఇంటిని మొత్తం క్లీన్ చేస్తున్నారా? ఇలా చేస్తే ఇల్లు తళతళ మెరవడం ఖాయం..!
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పటాకాయలు పేలనున్నాయి. ఇప్పటికే దీపావళి(Diwali) పండుగ కోసం పలువురు జనాలు షాపింగ్ లు మొదలుపెట్టారు. ఇల్లు సర్దడం స్టార్ట్ చేశారు. అయితే ఈ క్రమంలో ఇంటి గోడల్ని కూడా శుభ్రం చేస్తారు. సాధారణంగా ఇంటి గోడలపై పిల్లలు పెన్నులు(Pens), పెన్సిల్స్(pencils) తో గీస్తూ ఉంటారు. అలాగే దుమ్ము ధూళి(dust) చేరి గోడలు బాగా మురికిగా తయారవుతాయి. కాగా ఇలాంటి సమయంలో ఎక్కువగా కష్టపడకుండా ఈ సింపుల్ నేచురల్ టిప్స్ పాటిస్తే మీ హోమ్ తళతళ మెరిసిపోతుంది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

గోడలపై పిల్లలు గీసిన గీతలను తొలగించడానికి టూత్ పేస్ట్ ను వాడండి. టూత్ పేస్ట్(Tooth paste) ను మరకలు ఉన్న చోట రాసి.. కాసేపయ్యాక ఒక క్లాత్ తో తుడిస్తే సరిపోతుంది. అలాగే వంట సోడలతో కూడా గోడలపై గీతల్ని పోగోట్లవచ్చు. ఒక స్ఫూన్ సోడా(Soda)లో నీళ్లు పోసి.. బ్రష్ తో రుద్దితే చాలు. మరకలు, గీతలు మాయమవుతాయి. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ గోడలను వాటర్ పోసి కడగకండి. దీంతో పెయింట్ పోతుంది. గోడలపై జడ్డు మరకల్ని తొలగించడానికి వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed