- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా దినోత్సవ వేడుకల్లో రచ్చ రచ్చ.. ఆ ఎమ్మెల్యే పేరు కోసమే లొల్లి..!
దిశ, వికారాబాద్ రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక మున్సిపల్ గాంధీ పార్కులో చైర్ పర్సన్ మంజుల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో రాజకీయ రగడ చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు సుధాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అంగోతి దేవి రెడ్యానాయక్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా సభను ఉద్దేశించి మాట్లాడిన కాంగ్రెస్ కౌన్సిలర్ జైదుపల్లి మురళి ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, ముఖ్య అతిథి ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేరు చెప్పకుండానే ప్రసంగం ప్రారంభించాడు. దీంతో గతంలో కూడా ఇలాగే జరిగిందని, కావాలనే ప్రొటోకాల్ పక్కన పెట్టి ఎమ్మెల్యే పేరు చెప్పకుండానే ప్రసంగం ఎలా చేస్తావు అని స్థానిక టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడంతో.. అప్పటివరకు ప్రశాంతంగా జరిగిన సభలో రగడ మొదలైంది. ఎమ్మెల్యే పేరు చెబితేనే ప్రసంగం చేయాలని కోరడంతో సభలో రచ్చ మొదలైంది. చివరికి చైర్ పర్సన్ కలుగజేసుకుని సమస్య సద్దుమణిగేలా చేయడంతో వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.