మున్సిపల్ చైర్ పర్సన్ ఇంట్లో దొంగతనం.. విచారణ ముమ్మరం చేసిన సీఐ

by Javid Pasha |
మున్సిపల్ చైర్ పర్సన్ ఇంట్లో దొంగతనం.. విచారణ ముమ్మరం చేసిన సీఐ
X

దిశ, ఆందోల్: అందోల్-జోగిపేట మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కవిత సురేందర్ గౌడ్ ఇంట్లో ఈ నెల 14న జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి జోగిపేట నాగరాజు విచారణ చేపట్టారు. శనివారం జోగిపేటలోని ఆమె నివాసానికి వెళ్ళి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. దుండగులు ఇంట్లోనికి ఎలా ప్రవేశించారు? ఇంట్లో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? అంటూ చైర్ పర్సన్ భర్త సురేందర్ గౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇంటి పరిసరాలను సైతం పరిశీలించిన ఆయన త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు. ఆయనతోపాటు ఎస్సై వెంకటేశం సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed