- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సక్సెస్ మీట్‌లో కలుస్తా: అనన్య నాగళ్ల
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల(Ananya Nagalla) ‘శ్రీకాకుళం సెర్లాక్‌హోమ్’ (Srikakulam Serlakhome)ప్రెస్ మీట్‌లో తన ఇండస్ట్రీ ఎంట్రీ గురించి పంచుకుంది. ‘నేను ఇండస్ట్రీకి వచ్చి 5ఏళ్లు అవుతుంది. ఫస్ట్ ‘మల్లేశం’(Mallesham)తో స్టార్ట్ చేశాను. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇంట్లో చెప్పలేదు. షూటింగ్ అయిపోయి ఇక సినిమా రిలీజ్ అవుతుందనే టైంలో.. రెండు నెలల ముందు మా అమ్మకు కాల్ చేసి ఇండస్ట్రీకి వచ్చా అని చెప్పా. మా అమ్మ చాలా గొడవ పెట్టింది. తర్వాత ఒకరోజు కాల్ చేసి నీ పెంపకం అలా ఉంది అని మా అమ్మను రిలేటివ్స్ అన్నట్లు చెప్పి చాలా ఎమోషనల్ అయింది. అప్పుడు అనుకున్నా కచ్చితంగా సక్సెస్ అందుకోవాలని. నేను కూడా కంటెంట్ ఉన్న మూవీలే చేస్తున్నాను. మల్లేశం, ప్లే బ్యాక్, వకీల్ సాబ్(Vakil Saab), తంత్ర(Thantra), పొట్టేల్(Potel).. ఇప్పుడు వస్తున్న శ్రీకాకుళం సెర్లాక్‌హోమ్ అన్నీ ఫిలీమ్స్‌లోనూ నా100% నేను ఇస్తున్నాను. ఒక మంచి కథను ఎంచుకుని ఆ కథకు తగ్గట్టుగా యాక్ట్ చేస్తూ.. ప్రమోషన్స్‌లో కూడా 100% ఇస్తున్నాను. కానీ, ఎందుకు వర్కౌట్ అవ్వడం లేదని చాలా మంది అడుగుతున్నారు. ఈ సినిమాతో అదంతాపోయి మంచి సక్సెస్ అందుకుని సక్సెస్‌ఫుల్ యాక్టర్‌గా సక్సెస్ మీట్‌లో మిమ్మల్ని కలుద్దామని అనుకుంటున్నాను. ఆ నమ్మకం కూడా ఉంది’ అని చెప్పుకొచ్చింది.