Nerella Sharada: మహిళ కమిషన్ చైర్మన్ తో మలేషియా ప్రతినిధుల బృందం భేటీ

by Ramesh Goud |
Nerella Sharada: మహిళ కమిషన్ చైర్మన్ తో మలేషియా ప్రతినిధుల బృందం భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: మహిళ కమిషన్ చైర్మన్(Women Commission Chairman)తో మలేషియా ప్రతినిధుల బృందం(Malaysian Representatives) భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మహిళ కమిషన్ ఏర్పాటు, ప్రాముఖ్యత గురించి చైర్మన్‌ను ఆరా తీశారు. మంగళవారం బుద్ధ భవన్(Buddha Bhavan) లో మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud), మాజీ ఎమ్మెల్సీ సంతోష్(Former MLC Santhosh), ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్(MBC Corporation Chairman Vijay) హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు, పనితీరును మలేషియా పారిశ్రామిక వేత్తల బృందం చైర్మన్ నేరెళ్ల శారద(Nerella Sharada)ను అడిగి తెలుసుకున్నారు. దీనిపై మహిళల హక్కులను పరిరక్షించడం కోసం కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, సమాజంలో మహిళల పట్ల వివక్షతను తొలగించి.. జెండర్ సెన్సిటైజేషన్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారత కోసం కృషి చేయడం జరుగుతుందని కమిషన్ చైర్మన్ శారద వారికి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed