- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోరా...?
దిశ,తుంగతుర్తి: తమ ప్రాంతాల మీదుగా హనుమకొండకు బస్సు సర్వీస్ నడిపించాలని తుంగతుర్తి మండలంలోని ఆయా ప్రాంతాల ప్రజలు ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై గతంలో ఎన్నో మార్లు వారికి విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం లేదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా అర్వపల్లి,బొల్లంపల్లి,వెలుగుపల్లి,తుంగతుర్తి, వెంపటితో పాటు తదితర ప్రాంతాలకు ప్రజలు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. విద్య,వైద్యం,వ్యాపార రంగాలకు సంబంధించి ప్రధానంగా ఉన్న హనుమకొండ,ఖమ్మం ప్రాంతాలతో ఇక్కడి ప్రజలకు నిత్యం సంబంధాలు ఉంటాయి. అంతేకాకుండా తుంగతుర్తి మండల కేంద్రం మీదుగా (వెంపటి,గొట్టిపర్తి)హైదరాబాద్ కు బస్సు సర్వీసు నడపడం ద్వారా దాదాపు 10 గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.
తుంగతుర్తి మండలం మీదుగా తొర్రూరు-హనుమకొండ, మద్దిరాల-ఖమ్మం మార్గాలలో ప్రతిరోజు రెండు మూడు దఫాలుగా ఆర్టీసీ సర్వీసులు తిరిగేవి. హనుమకొండకు ఉదయం-సాయంత్రం,ఖమ్మంకు ఉదయం-మధ్యాహ్నం వేళల్లో నడవడంతోపాటు..నైట్ హాల్ట్ చేసే బస్సులు ఉండడం మూలంగా ఆర్టీసీకి ఆదాయంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యంగా ఉండేది. అయితే ఎలాంటి కారణాలు లేకుండానే వీటిని రద్దు చేయడంతో..ఆయా ప్రాంతాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. విద్య,వైద్యం,వ్యాపారం రంగాలపరంగా ప్రజలు తుంగతుర్తి నుంచి హనుమకొండ, ఖమ్మంలకు వెళ్లాలంటే ప్రైవేట్ వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య గత కొంత కాలం నుంచి రద్దు చేసిన బస్సులను పునరుద్ధరించాలంటూ ఆయా ప్రాంతాల ప్రజలు ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. కానీ ఫలితం శూన్యం. ఇదిలా ఉంటే రద్దు చేసిన బస్సు సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోతి రాములు గౌడ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.