చైనాలో కుప్పకూలిన విమానం నుంచి మరో బ్లాక్‌బాక్స్ లభ్యం..

by Satheesh |
చైనాలో కుప్పకూలిన విమానం నుంచి మరో బ్లాక్‌బాక్స్ లభ్యం..
X

బీజింగ్: వారం రోజుల కిందట కూలిపోయిన చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ విమానం ప్రమాదంలో రెండో బ్లాక్స్ లభించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. 132 మందితో ప్రయాణిస్తుండగా వేల మీటర్ల ఎత్తు నుంచి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రమాదం జరిగిన తీరును తెలుసుకోవడానికి ఉపయోగపడే బ్లాక్ బాక్స్‌ల కోసం ప్రభుత్వం తీవ్రంగా గాలింపు చేసింది. బుధవారం ఒకటి లభించగా, తర్వాత రెండోది లభించినట్లు అధికారులు తెలిపారు. గాలింపు చర్యలకు మధ్యలో వర్షం అడ్డంకి కలిగించినట్లు సిబ్బంది తెలిపారు. అయితే బాక్స్ కోసం ప్రమాద స్థలంలో మట్టిని తవ్వినట్లు చెప్పారు. మీటర్ పైగా లోతులో ఈ బాక్స్ ను గుర్తించారు. కాగా ఈ బ్లాక్ బాక్స్ ద్వారా వేగం, ఎత్తు, దిశ పైకి లేదా క్రిందికి, పైలట్ చర్యలు, కీలక వ్యవస్థల పనితీరు గురించి సమాచారం తెలుసుకోవచ్చు.

Advertisement

Next Story