- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విశ్రాంతి అవసరం: యశోద వైద్యులు
దిశ, వెబ్‌డెస్క్: స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆరోగ్య పరీక్షలన్నీ పూర్తయ్యాయి. దీంతో యశోద ఆస్పత్రి డాక్టర్లు మీడియాకు సీఎం ఆరోగ్య వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంవీ రావు మాట్లాడుతూ.. ఇవాళ సాయంత్రం మూడు గంటలకు ముఖ్యమంత్రిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. వరుస పర్యటనలతో నీరసంగా ఉన్నారని, అందులోనూ ఎడమ చెయ్యి నొప్పిగా ఉందని పలుమార్లు చెప్పారు, అందుకే ఇవాళ ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేశామని వెల్లడించారు. యాంజియోగ్రామ్‌లో బ్లాక్స్ లేవని, ఈసీజీ, 2డీ-ఎకో పరీక్షలు కూడా చేసినట్లు తెలిపారు. కార్డియో వైపు నుంచి కూడా ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. మెడ, బ్రెయిన్‌కు సంబంధించి ఎమ్ఆర్ఐ పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. వయసుతో పాటు వచ్చే స్పాండిలైటిస్ కొంచెం ఉందని తెలిపారు. కాకపోతే కొంతకాలం ముఖ్యమంత్రికి విశ్రాంతి అవసరమని, దాదాపు ఒకవారం పాటు విశాంత్రి తీసుకుంటే మంచిదని సూచించారు.
సీఎం కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో పరీక్షలు చేస్తుంటాం. రెండు రోజులుగా బలహీనంగా ఉన్నట్లు చెప్పారు. సాధారణ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం: సీఎం వ్యక్తిగత డాక్టర్ శ్రీ ఎం.వి.రావు pic.twitter.com/WUxlaFwo7J
— Telangana CMO (@TelanganaCMO) March 11, 2022