- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతి అంతానికి హెల్ప్‌లైన్.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్
చండీగఢ్ : పంజాబ్‌లో అవినీతి అంతానికి ఆప్ సర్కార్ కట్టుబడి, అందుకోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం ప్రకటించారు. బుధవారం పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్ తన పదవీ కాలంలో ఒక్కరోజు కూడా వృధా కాకూడదని, మార్చి 23న స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి నాడు 'అవినీతి నిరోధక హెల్ప్‌లైన్' ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఈ హెల్ప్ లైన్ తన వ్యక్తిగత నంబర్ అని పంజాబ్ ప్రజలకు వివరించారు. ఎవరైనా లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తే అందుకు సంబంధించిన ఆడియో, వీడియోలను ఈ నంబర్‌కు పంపించాలని కోరారు.
'నేను ఏ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో 99 శాతం నిజాయితీ పరులు ఉన్నారు. మిగిలిన ఒక శాతం అవినీతి అధికారులను ఏరిపారేయడమే నా కర్తవ్యం. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించడమే ఆప్ సర్కార్ ప్రథమ లక్ష్యం' అని ట్విట్టర్ వేదికగా పంజాబ్ సీఎం స్పందించారు. ఫిబ్రవరి 5న ఎన్నికల ప్రచారంలో పార్టీ అధినేత, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆప్ సర్కార్ అధికారంలోకి అవినీతిని అంతమొందిస్తానని చేసిన వాగ్దానాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇది స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమ పుట్టుకను సూచిస్తుందన్నారు.