- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలెంట్ టెస్ట్‌కు అనూహ్య స్పందన.. భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థులు
దిశ, సంగారెడ్డి : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ జిల్లాస్థాయిలో నిర్వహించారు. సంగారెడ్డి పరిధిలోని పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో సోమవారం ఈ పరీక్ష నిర్వహించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతితో పాటు సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా డీఎస్పీ శ్రీ బాలాజీ హాజరయ్యారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విధ్యార్దులకు బహుమతులు, సర్టిఫికెట్‌లు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్ట్ అభినందనీయమన్నారు.
అంతేకాకుండా ఇందులో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను ఆయన మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ విజయ భాస్కర్ , మండల విధ్యాధికారి వెంకట నరసయ్య, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్, ప్రధాన కార్యదర్శి జాన్ పాల్, రాష్ట్ర కార్యదర్శి బాలయ్య, చెకుముకి కన్వీనర్ శశిధర్, జనవిజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి ప్రశాంత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జగన్మోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.