- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Game Changer: చరణ్ కి టెన్షన్ .. శంకర్ కి ట్రోలర్స్ భయం.. మరి గేమ్ ఛేంజర్ ఏమి చేస్తుందో?
దిశ, వెబ్ డెస్క్ : ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కెరియర్ పూర్తిగా మారిపోయిందనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకైనా ఫస్ట్ సినిమా ఫ్లాప్ పడుతుందనే సెంటిమెంట్ పదేళ్ల నుంచి వస్తుంది. రీసెంట్ గా ఎన్టీఆర్ ఆ నెగిటివ్ కామెంట్స్ కి దేవరతో సమాధానం చెప్పాడు. ఇక, ఇప్పుడు చరణ్ వంతు ఉంది. గేమ్ ఛేంజర్ మూవీతో హిట్ కొట్టి గ్లోబల్ స్టార్ కూడా ఈ గండం నుంచి బయట పడాలి.
ఇదిలా ఉండగా.. శంకర్ తీసిన ఇండియన్ 2 తో ఫ్లాప్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ లో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. మళ్ళీ వారికి సినిమా పై నమ్మకం కలగాలంటే టీజర్ తో కానీ ట్రైలర్ తో కానీ బూస్ట్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఈ సినిమా అటు ఇటు ఐతే అది రామ్ చరణ్ మార్కెట్ పై ప్రభావం చూపుతుంది.
ఇండియన్ 2 మూవీ సమయంలో ట్రోలర్స్ శంకర్ ను ఒక రేంజ్ లో ఆడుకున్నారు. మరి, ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాకి ఏమవుతుందనే భయం కూడా అభిమానుల్లో ఉంది. కాబట్టి ఏమి జరిగినా సరే చరణ్ కు ఉన్న క్రేజ్ ను, అతని మార్కెట్ ను డ్యామేజ్ చేయకుండా ఉంటే చాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.