- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chaitanya -Shobhitha: నాగ చైతన్య- శోభితల పెళ్లి ఎక్కడో తెలిసిపోయింది!.. ఈ స్పెషల్ ప్లేస్‌లోనే
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Nagavhaitanya) సామ్(Samantha) జంటగా మొదటి సారి ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాలో నటించారు. ఈ సినిమాలో తమ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలా నటించిన వీరు నిజజీవితంలో కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇక కొన్నేళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ వీరి వైవాహిక జీవితం ఎన్నో ఏళ్లు నిలవలేకపోయింది. దీంతో ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే డివోర్స్ తర్వాత చైతన్య స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Shobhitha Dulipala)తో డేటింగ్‌లో ఉంటూ ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్(Enagement) చేసుకున్నాడు. ఇక వీరి పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. డిసెంబర్‌లో ఇద్దరు ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వీరి మ్యారేజ్ ఓ స్పెషల్ ప్లేస్‌లో జరగబోతున్నదనే వార్త నెట్టింట షికారు చేస్తోంది.
ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించిన పనులు మొదలయ్యాయి అన్న సంగతి తెలిసిందే. నాగచైతన్య తన స్నేహితులకు వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు(Wedding Invitation Card)లు కూడా పంచుతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి వీరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్(Destination Wedding) అయ్యే చాన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఏదైనా రాజస్థాన్(Rajasthan) లాంటి ప్రాంతానికో లేక దుబాయ్(Dubai) లాంటి ప్రాంతానికో వెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంటారు అని అందరూ భావించారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ అన్నపూర్ణ స్టూడియోస్(annapurna Studios)లో సిద్ధం చేస్తున్న ఒక స్పెషల్ కళ్యాణ మండపంలో వీరి వివాహం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోపక్క నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న ‘తండేల్’(Tandel) సినిమా యూనిట్ నవంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. దీంతో ఒకేసారి రెండు న్యూస్‌లు తెలిసేసరికి అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
Read More : నాగచైతన్యపై రివెంజ్ తీర్చుకోవడం కోసం గట్టిగా ప్లాన్ చేసిన సమంత.. నెట్టింట దుమారం రేపుతున్న న్యూస్