- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Monkeypox Guidelines: మంకీపాక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు జారీ
దిశ, డైనమిక్ బ్యూరో : Centre Releases Guidelines to Contain Spread of Monkeypox Infection| దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి విస్తరించకుండా ప్రజలు ఏం చేయాలో, ఏం చేయకూడదో వివరిస్తూ కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. మంకీపాక్స్ బాధితులు మూడు లేయర్ల మాస్క్ ధరించాలని, దద్దుర్లకు గాలి తగలకుండా చర్మాన్ని పూర్తిగా కప్పే విధంగా ఉండే దుస్తులను వేసుకోవాలని తెలిపింది. వ్యాధి సోకిన వ్యక్తులకు దగ్గరగా ఉండాల్సి వస్తే మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ధరించాలని ప్రజలకు సూచించింది. ఆ తర్వాత చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని స్పష్టంచేసింది. మంకీపాక్స్ బాధితులను తాకినా, దగ్గరగా ఉన్నా వ్యాధి సోకే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. బాధితులు ఉన్న ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరింది. తప్పుడు సమాచారంతో బాధితులపై వివక్ష చూపకూడదని వివరించింది. మంకీపాక్స్ బాధితులు ఉపయోగించే దుస్తులు, వాడే టవళ్లు, పడుకునే మంచాన్ని కుటుంబంలో ఇతరులు వాడకూడదని, బాధితులు ఉపయోగించిన దుస్తులను మిగిలిన కుటుంబ సభ్యుల దుస్తులతో కాకుండా ప్రత్యేకంగా శుభ్రం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు జారీచేసింది.
ఇది కూడా చదవండి:
ఉడుకుతున్న సాంబారులో పడిన వ్యక్తి.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు