- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ.. అర్హులు వీరే
దిశ, వెబ్‌డెస్క్: మహిళలు ఆర్థికంగా స్థిరపడటానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల మరో పథకాన్ని మహిళల కోసం కొత్తగా తీసుకొచ్చింది. ఈ పథకానికి 'ఉచిత కుట్టు యంత్రం యోజన(Free Sewing Machine)- 2022' గా నామకరణం చేసింది. ఈ పథకం ద్వారా నిరుపేద మహిళలు సులభంగా ఆదాయం పొందేలా కుట్టు మిషన్లను అందిస్తారు. వారు ఆర్థికంగా ఎదగడానికి ఇది బాగా ఉపయోగపడుతుందనేది కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం. అర్హత కలిగిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లను అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలోని 50 వేల మంది మహిళలకు ఈ పథకాన్ని వర్తింప చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.పథకానికి అర్హులు..
దేశంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 20 నుంచి 40 మధ్య వయస్సు ఉన్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా దరఖాస్తుదారు భర్త వార్షికాదాయం రూ.12వేలకు మించకూడదు. వితంతువులు, దివ్యాంగులు కూడా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉచిత కుట్టు మిషన్ పొందడానికి అవసరమైన పత్రాలు..
1. ఆధార్ కార్డు, 2. పుట్టిన తేదీ సర్టిఫికెట్, 3. ఆదాయ ధృవీకరణ పత్రం, 4. పాస్‌పోర్ట్ సైజు ఫొటో, 5. మొబైల్ నెంబర్
దరఖాస్తు విధానం..
* అర్హత కలిగిన మహిళలు ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.india.gov.inకి వెళ్లాలి.
* వెబ్‌సైట్ హోమ్ పేజీలో, కుట్టుపని ఉచిత సరఫరా కోసం అప్లై చేయడానికి లింక్‌ను క్లిక్ చేయాలి.
* అందులో ఇచ్చిన వివరాలు నింపాలి.
* తర్వాత అధికారులు దర్యాప్తు చేసి, దరఖాస్తులో ఇచ్చిన సమాచారం సరైనదా, కాదా అని నిర్ణయిస్తారు.
* ఇచ్చిన సమాచారం సరైనది అయితే ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వబడుతుంది.