జల్సాలకు డబ్బులు సరిపోక గంజాయి అమ్మకం.. వ్యక్తి అరెస్ట్

by Vinod kumar |
జల్సాలకు డబ్బులు సరిపోక గంజాయి అమ్మకం.. వ్యక్తి అరెస్ట్
X

దిశ, వరంగల్ టౌన్: జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తికి డబ్బులు సరిపోక పోవడంతో గంజాయి అమ్మకాలు చేస్తున్నాడు. అతన్ని వరంగల్ పోలీసులు ఆటో నగర్ శివారులోని స్మశానవాటిక సమీపంలో సోమవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవాడ కు చెందిన కోరే సాయికృష్ణ మూడేళ్లుగా గంజాయి సేవించడానికి, జల్సాలకు డబ్బులు సరిపోక పోవడంతో గంజాయి అమ్మకాలు మొదలుపెట్టాడు.


ఈ మేరకు లేబర్ కాలనీలో తనకు తెలిసిన పెద్దపల్లి రవి వద్ద గంజాయిని కొనుగోలు చేసి పొడిగా మార్చి అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద పొడిచేసిన 500 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.50 వేలు ఉందని తెలిపారు. ఇతని పట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ కానిస్టేబుల్స్ రాంరెడ్డి, వంశీకృష్ణ లను ఏసీపీ గిరి కుమార్ అభినందించారు.

Advertisement

Next Story