- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరుదైన ఘనతను సాధించిన ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్!
బెంగళూరు: దేశీయ దిగ్గజ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ అరుదైన ఘనతను సాధించింది. క్రీడారంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిఫా వరల్డ్ కప్-2022కి అధికారిక స్పాన్సర్‌గా ఎంపికైనట్టు గురువారం ప్రకటించింది. అలాగే, ఫిఫా వరల్డ్ కప్‌ను స్పాన్సర్ చేస్తున్న మొదటి ఎడ్‌టెక్ భారత కంపెనీగా బైజూన్ నిలవనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్ ఈవెంట్ ఫిఫా వరల్డ్ కప్-2022కి స్పాన్సర్‌గా ఉండటం పట్ల ఎంతో గర్వంగా ఉంది. ప్రతిష్టాత్మక వేదికపైన భారత్‌కు ప్రాతినిధ్య లభించడం, విద్య, క్రీడలు రెండింటినీ ఒకచోట చేర్చడం సంతోషంగా ఉందని బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈఓ బైజు రవీంద్రన్ చెప్పారు. బైజూస్ లాంటి సంస్థతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ప్రపంచ సాకర్ గవర్నింగ్ బాడీ ఫిఫా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కె మదతి అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రపంచంలో ఉన్న యువతకు సాధికారతకు అవకాశం కల్పిస్తుందని ఆయన వెల్లడించారు.