పెళ్లికి ముందే పిల్లలు కావాలంటున్న స్టార్ సింగర్.. పోస్ట్ వైరల్

by Satheesh |   ( Updated:2022-03-06 19:22:06.0  )
పెళ్లికి ముందే పిల్లలు కావాలంటున్న స్టార్ సింగర్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: హాలీవుడ్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌ తనకు కాబోయే భర్త 'సామ్ అస్గారి'కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 28వ పుట్టినరోజును జరుపుకుంటున్న సామ్‌ను ఉద్ధేశిస్తూ తన జీవితం అధికారికంగా అతనితోనే పెనవేసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సామ్ ఫొటోను పోస్ట్‌ చేసిన బ్రిట్నీ.. 'అతను చాలా కష్టపడి పనిచేస్తాడు. నా అభిరుచులకు తగ్గట్లుగా నడుచుకుంటూ ప్రతిరోజూ నన్ను ఆశ్చర్యపరుస్తాడు. అతనితో జీవితాన్ని పంచుకోవడం నిజంగా నా అదృష్టం. హ్యాపీ బర్త్‌డే' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అలాగే మరో పోస్ట్‌లో అతనితో కలిసి కుటుంబాన్ని కోరుకుంటున్నట్లు తెలిపిన బిట్నీ.. 'నా కాబోయే భర్తకు జన్మదిన శుభాకాంక్షలు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నాకు నీతో ఒక కుటుంబం కావాలి. అన్నీ నీతోనే కావాలి' అంటూ రాసుకొచ్చిది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. 2016 నుంచి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.


Advertisement

Next Story