15 ఏళ్ల తర్వాత తల్లయ్యింది.. కడుపులో ఉంది బిడ్డా.. ఫుడ్డా?

by samatah |
15 ఏళ్ల తర్వాత తల్లయ్యింది.. కడుపులో ఉంది బిడ్డా.. ఫుడ్డా?
X

దిశ, సినిమా : పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌కు మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. తండ్రి కన్జర్వేషన్‌షిప్ నుంచి ఈ మధ్యే బయటపడిన ఆమె.. కోరుకున్న వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని హాయిగా ఉంటోంది. ఈ క్రమంలోనే పార్ట్‌నర్ సామ్ అస్ఘరితో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన భామ.. పొట్ట పెరగడం చూసి ఫుడ్ ఎక్కువైందని అనుకుందట. కానీ టెస్ట్ చేయిస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లు వెల్లడించింది. ఈ మేరకు దాదాపు 15 ఏళ్ల తర్వాత మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించింది. గతంలో ఓసారి బిడ్డ కడుపులో ఉండగా పెరినాటల్ డిప్రెషన్‌ అనుభవించిన బ్రిట్నీ.. ఆ సమస్యను సీక్రెట్‌గా ఉంచి బాధపడినట్లు చెప్పింది. కానీ ఇప్పుడు రోజూ యోగా చేస్తూ మాతృత్వాన్ని మరింత ఎంజాయ్ చేస్తానని తెలిపింది.

ఇక సామ్‌తో కలిసి తొలి బిడ్డకు ఆహ్వానం పలకబోతున్న బ్రిట్నీకి అభిమానులు, సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెప్తున్నారు. 'ఓ మై గాడ్.. నిజమా' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా బ్రిట్నీ కన్జర్వేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు తనకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story