Brahmamudi : చిన్న విషయానికి పెద్ద రాద్దాంతం చేసావ్ కదా.. వాళ్ళు రారు .. చచ్చేదాకా ఇక ఏడువ్ అంటూ ధాన్యం మీద ఫైర్ అయిన ప్రకాశం

by Prasanna |
Brahmamudi : చిన్న విషయానికి పెద్ద రాద్దాంతం చేసావ్ కదా.. వాళ్ళు రారు .. చచ్చేదాకా ఇక  ఏడువ్ అంటూ ధాన్యం మీద ఫైర్ అయిన ప్రకాశం
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

నేటి ఎపిసోడ్ లో అప్పూ, ధాన్యం ఇద్దరూ గొడవ పడుతుంటారు. అప్పూ గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ధాన్యం మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే నిలబడి చూస్తుంది. అప్పూ మళ్లీ మాట్లాడుతూనే ఉంటుంది. ‘ఇప్పుడు చెబుతున్నా .. ఇంతమంది సాక్షిగా చెబుతున్నా .. మీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించడం లేదు .. మీరు వద్దు.. మీ కోట్ల ఆస్తి కూడా వద్దు.. మీ కొడుకు కారం వేసి పెట్టినా తింటాను.. కానీ, కళ్యాణ్‌ ను మాత్రం వదలను.ఇలా చేయడం మీకు కొత్తేమి కాదు.. ఇంతక ముందు కూడా నన్ను ఇలాగే పిలిచి అవమానించారు.. ఇంకోసారి, మీ కొడుకు వస్తానన్నా కూడా నేను మాత్రం ఇక్కడికీ రానివ్వను..’ అంటుంది అప్పూ. ఆ మాటలకు అందరూ షాక్ అయి నిలబడి చూస్తుంటారు.

‘రా కవి’ అంటూ.. అప్పూ.. కవి ని తీసుకుని వెళ్లిపోతుంది. కళ్ళ ముందే కొడుకు వెళ్లిపోతుంటే.. ‘కళ్యాణ్ కళ్యాణ్’ అని ధాన్యం పిలుస్తూనే ఉంటుంది. ఏం మాట్లాడాలో తెలియక రాజ్ బాధ పడుతూ ఉంటాడు. ప్రకాశం, ధాన్యం మీద అరుస్తాడు. ' ఇప్పుడు సంతోషంగా ఉందా.. చెప్పు.. చిన్న విషయానికి కూడా ఇంత రాద్దాంతం చేసి ఒకర్ని బాధపెట్టి సంతోషంగా ఉన్నావా .. చచ్చేదాకా ఇక ఏడువు .. ఇప్పుడు ఏం చేస్తావే.. చెయ్ .. ’ అంటూ అరుస్తాడు. వెంటనే ధాన్యం కూడా ఇలా మాట్లాడుతుంది.. " వాడు నా కొడుకండీ.. వాడిని ఎవరితో పోనివ్వను.. నా కొడుక్కి న్యాయం జరగాలి..’అని గట్టిగా అరిచి చెబుతుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed