Brahmamudi : కవి ఫొటోలు తీసి కొత్త కథ అల్లడానికి సిద్ధమవుతున్న అనామిక

by Prasanna |
Brahmamudi : కవి ఫొటోలు తీసి కొత్త కథ అల్లడానికి సిద్ధమవుతున్న అనామిక
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ( Brahmamudi ) సీరియల్ ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

‘ఎవరూ ఈ పతివ్రతా ఇలా వస్తుంది.. పాపం చేసిన ఈమె శాపం పెడితే జరుగుతుందా? నీకె మా ఇంటి శాపం బాగా తగిలింది. అందుకే నువ్వు ఇలా రోడ్లు మీద తిరుగుతున్నావ్ .. తిలాపాపం తలాపిడికెడు అన్నట్లుగా.. నీకు కూడా ఈ పాపంలో భాగం ఉంది ’ అని కవి అంటాడు. అప్పుడు వెంటనే అనామిక.. " కళ్యాణ్.. నువ్వు ఇంక ఆపు .. నా గురించి మాట్లాడే ముందు నీ గురించి చూసుకో .. నువ్వు చెప్పేది కవిత్వంలాగే ఉంది .. మాట్లాడినట్టు అసలు లేదు ..ముందు నువ్వు నీ బతుకేంటో తెలుసుకో.. నీ అప్పూ ఏం మంచిది కాదు .. అది నిన్ను ఇంకా అప్పుల్లో ముంచేయడం పక్కా అంటూ " అనామిక అంటుంది.

నేను ఏమి దిగజారి బతకడం లేదు నువ్వు ఇంకొకడి కారులో ఉండటం.. అది దిగజారడం అవుతుంది. ఆటో నడపడంలో ఎలాంటి తప్పు లేదు .. ఇప్పుడు నా కష్టం మీద బతుకుతున్నా .. నేను ప్రశాంతంగా నిద్రపోతున్నా.. కానీ నువ్వు మాత్రం అలా ఎప్పటికి ఉండలేవు.. అసలు నీలాంటి దానికి నాతో మాట్లాడే అర్హత కూడా లేదు ఇక్కడి నుంచి వెళ్లిపో అని తిట్టేసి ఆటో ఎక్కి ఆటో స్టార్ట్ చేస్తూ ఉంటాడు కవి.

అప్పుడు వెంటనే అనామిక.. కవికి ఆటో నడుపుతున్న ఫోటోలను తీస్తుంది.. ఎందుకు ఆ ఫోటోలు తీస్తున్నావ్ అని సామంత్ అంటాడు. ‘ ఈ రోజుకి ఇది చాలు.. ఇప్పుడు మనకీ ఇలాంటివి కావాలి దుగ్గిరాల వారి పరువు ప్రతిష్టలను దిగజార్చడానికి’ అని అనామిక అంటుంది.

Advertisement

Next Story

Most Viewed