అమావాస్య చీకట్లలో దారుణం.. బాలుడి రెండు చేతులకు దారం కట్టి..

by Manoj |
అమావాస్య చీకట్లలో దారుణం.. బాలుడి రెండు చేతులకు దారం కట్టి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అమావాస్య చీకట్లలో బాలుడిని దారుణంగా హత్య చేశారు అగంతకులు. చేతులను దారంతో కట్టి వేసి నిజాం సాగర్ కాలువలో పారేశారు. నగరంలోని ఆరవ టౌన్ పరిధిలోని బాబాన్ సాహబ్ పహడ్ వద్ద శుక్రవారం బాలుడి డెడ్ బాడీ దొరికింది. నగరంలోని ఆటో నగర్ నయా బ్రిడ్జి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫయాజ్( 7) గురువారం సాయంత్రం కనిపించకుండా పోయాడు.

తండ్రి యూనుస్ స్థానిక అరవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రాథమికంగా విచారణ చేపట్టి శుక్రవారం ఉదయం స్టేషన్‌కు రావాలని పంపించి వేశారు. ఉదయం వేళ నిజాం సాగర్ డి-54 కాలువలో బాలుడి మృతదేహాన్ని గుర్తించి స్థానికులు సమాచారం అందించగా.. పోలీసులు, కుటుంబ సభ్యులు బాలుడిని ఫయాజ్‌గా గుర్తించారు. ముక్కు పచ్చలారని బాలుడి రెండు చేతులకు దారం కట్టి కాలువలో పడేసేటంతా కక్ష్యలకు కారణం ఏమిటో తెలియడం లేదు. అమావాస్య సందర్భంగా మంత్రగాళ్లు మంత్రాలు చేసి బాలుడిని హతమార్చి ఉండవచ్చని భావిస్తున్నారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.

Advertisement

Next Story