- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త ఇయర్‌బడ్స్.. 10 నిమిషాల చార్జ్‌లో 100 నిమిషాల ప్లేబ్యాక్
దిశ, వెబ్‌డెస్క్: ఆడియో ఉత్పత్తుల సంస్థ బౌల్ట్ కొత్తగా 'ఎయిర్‌బాస్ ఎన్‌కోర్ ఎక్స్' ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ENCore X సరికొత్త బ్లూటూత్ 5.1 వైర్‌లెస్ కనెక్టివిటీని కలిగి ఉంది. బ్యాటరీ పరంగా 10 నిమిషాల చార్జ్‌లో 100 నిమిషాల ప్లేబ్యాక్‌ను అందిస్తోందని కంపెనీ పేర్కొంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం IPX5 రేటింగ్‌ను కలిగి ఉంది. దీనిని బయట ప్రదేశాలలో, జిమ్‌లో సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. "AirBass ENCore X అధిక ఎర్గోనామిక్స్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన డిజైన్" అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇయర్‌బడ్‌లు టచ్-సెన్సిటివ్‌గా ఉంటాయి. వాల్యూమ్‌ను సర్దుబాటు చేయడానికి, ట్రాక్‌లను మార్చడానికి, కాల్‌ల కోసం, వాయిస్ అసిస్టెంట్‌కి కమాండ్ చేయడానికి సులభంగా ఉంటుంది. వీటి ధర రూ. 1,799. కొత్త ఇయర్‌బడ్స్ ఏప్రిల్ 8 నుండి Amazon.inలో అందుబాటులో ఉంటాయి.