- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్‌ను చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి.. స్టార్ హీరో
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌ను బీట్ చేస్తూ దూసుకెళ్తుండటంపై మూవీ టీమ్‌ను ఆకాశానికెత్తేశాడు. ఇది తనకెంతో గర్వంగా ఉందన్న రణ్‌వీర్.. దర్శక ధీరుడు రాజమౌళి భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొస్తున్నారని, ఇది యావత్ దేశం సంతోషించదగ్గ విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్'లోని 'నాటు నాటు' సాంగ్‌ను తెలుగులో పాడి అభిమానులను అలరించాడు. ఇక రణ్‌వీర్‌తో పాటు ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సైతం 'ఆర్‌ఆర్ఆర్'పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
'టాలీవుడ్ చిత్రాలను చూసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ చాలా నేర్చుకోవాల్సి ఉంది. విభిన్న స్టోరీస్ ఎంచుకుంటూ మూస ధోరణికి స్వస్తి పలకాలి. బయోపిక్స్ హిట్ అయితే అందరూ వాటిపైనే ఫోకస్ చేస్తారు. సందేశాత్మక సినిమాలు విజయం సాధిస్తే అవే కథలు ఎంచుకుంటారు. కానీ సరికొత్త కథతో వచ్చిన 'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలు హిందీలో కూడా భారీ కలెక్షన్లు రాబట్టాయి' అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
. @RanveerOfficial ❤️ #RRRMovie pic.twitter.com/SHHZNq97ki
— RRR Movie (@RRRMovie) March 28, 2022