- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వడ్లు కొనేదాకా వదలం..రేపు ప్రతీ ఇంటిపై నల్లా జెండా: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే దాకా రైతుల పక్షాన పోరాడుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రైతులు పండించిన రెండు పంటల వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంజాబ్ తరహాలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. బీజేపీ నాయకులకు తెలంగాణ రైతుల మీద నిజమైన ప్రేమ ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ధాన్యం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నూకలు తినాలని అవహేళన చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేవపెట్టారని చెప్పారు.
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో సీఎం కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారని పేర్కొన్నారు. మార్చిలో తొలి విడుత ఉద్యమ కార్యాచరణ ముగిసిన తర్వాత తాజాగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రెండో విడుత ఉద్యమ కార్యాచరణ నిర్ణయించారని.. అధిస్థానం ఆదేశాల మేరకు మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, జాతీయ రహదారులపై రాస్తారోకో చేశామన్నారు. శుక్రవారం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, ఇండ్లపై నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలపాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి కేంద్ర వైఖరిని ఎండగట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ కె. విజయలక్ష్మి రెడ్డి, నిర్మల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ నల్లా వెంకట్రామ్ రెడ్డి, రైతులు, ఇతర ప్రజాప్రతినిదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.