- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లై డిటెక్టర్ కు రెడీ.. దమ్ముంటే టెస్టులకు రండి
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం జరిగిందని, అందులో నిజానిజాలను బయటకు తీయాలంటే లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని, సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పోయిన నెల 23వ తేదీ నుండి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ప్రశ్నించడం తో పాటు, ఎన్నికల అఫిడవిట్ విషయంలో ఎన్నికల కమిషన్, న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం సాగిస్తున్న వారితో పాటు మరి కొంతమందిని కిడ్నాప్ చేసి అక్రమ కేసులు పెట్టి కట్టు కథలు అల్లి వాళ్ళను జైలుపాలు చేశారని ఆరోపించారు.
పోలీసులు ఎత్తుకెళ్లిన వారి కుటుంబాలు పడుతున్న వారి వేదన గురించి ప్రశ్నించ వద్దా అని మండిపడ్డారు. కేవలం రాజకీయ భవిష్యత్తు కోసమే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నేను బీసీ ని.. అందుకే నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పే మంత్రి ఇప్పుడు ఎవరిపై కేసులు పెట్టారని ప్రశ్నించారు. మేము లేనప్పుడు రాత్రి వేళల్లో ఇళ్లపై దాడులు చేస్తారా..? దమ్ముంటే రండి ఇప్పుడు నా మీద దాడులు చేయండి అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పీకే చెప్పినట్టు నాటకాలు ఆడుతున్నాడు.
దమ్ముంటే సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, అరెస్టయి జైల్లో ఉన్న వారితో పాటు బీజేపీ నేతల మైన మా పైన కూడా లైవ్ డిటెక్టివ్ టెస్టులు జరపండి అప్పుడు నిజనిజాలు బయటపడతాయి అన్నారు. పాలమూరు ప్రజలు, మీడియా మిత్రులు భయపడవలసిన అవసరం లేదు. నిజనిజాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర నాయకుడు ఎం ఎం శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ఎగ్గని నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.