DK Aruna: 'కాంగ్రెస్ నిరసనలు చూస్తుంటే.. రాజ్ భవన్‌పై దాడి చేయడానికి వెళ్లినట్లుంది'

by GSrikanth |   ( Updated:2022-06-16 12:38:11.0  )
DK Aruna Releases Press Note About Vijaya Sankalpa Sabha
X

దిశ, తెలంగాణ బ్యూరో: DK Aruna says, TRS Supports Congress over raj bhavan attack| కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటే అని మరోసారి రుజువైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన వ్యవహారంపై గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ, బీజేపీ శాంతియుతంగా నిరసనకు పిలుపునిస్తే ఒక్క రోజు ముందే గృహ నిర్భంధం చేసే పోలీసులు, కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఛలో రాజ్ భవన్‌కు పిలుపిస్తే పోలీసులు వారిని కనీసం నియంత్రించలేకపోయారని ఆమె అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎవరికీ ఈడీ నోటీసులు ఇవ్వలేదా, నోటీసులు అందుకున్న వారంతా ఇదే విధంగా దాడులు చేశారా అని డీకే అరుణ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి చూస్తుంటే రాజ్ భవన్‌పై దాడి చేయడానికి వెళ్లినట్టు ఉందని, దానికి టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించినట్టు స్పష్టంగా తెలుస్తోందని డీకే అరుణ దుయ్యబట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story