- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్‌పై బీజేపీ మరో అస్త్రం.. కేసీఆర్‌కు ఇక చిక్కులే..?
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పై బీజేపీ మరో అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. తెలంగాణ అస్థిత్వాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిసైడ్ అయింది. సెప్టెంబర్ 17న నిర్వహించే 'తెలంగాణ విమోచన' దినోత్సవానికి బదులు 'తెలంగాణ విముక్తి' దినోత్సవంగా ఏడాది పాటు వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఏడాది పాటు సంబురాలు నిర్వహించినట్లే ఈ వేడుకలను నిర్వహించాలని కమలనాథులు డిసైడ్ అయ్యారు.
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధిస్తే.. హైదరాబాద్ సంస్థానానికి ఏడాది ఆలస్యంగా స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం ఆధీనంలో ఉన్న హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ లో విలీనమైంది. తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్ర్యం సిద్ధించిన సెప్టెంబర్ 17ను అధికారికంగా వేడుకలు నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని డిమాండ్ చేస్తూ వచ్చాయి. నేటి అధికార పార్టీ సైతం ఉద్యమ కాలంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది. తాము అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహిస్తామని గులాబీ దళపతి కేసీఆర్ అనేక వేదికలపై హామీ ఇచ్చారు. అయితే కేసీఆర్ ఆ హామీని విస్మరించడంతో బీజేపీ అదే అస్త్రాన్ని టీఆర్ఎస్ పై ప్రయోగించేందుకు సిద్ధమైంది. కమలనాథులు సైతం 2002 నుంచి ఇదే డిమాండ్‌ను వినిపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ ఆకాంక్ష నెరవేరిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఇచ్చిన హామీని విస్మరించారు. ఈ అంశాన్ని బీజేపీ పదే పదే గుర్తుచేస్తూనే ఉంది. టీఆర్ఎస్ మాత్రం ఎనిమిదేండ్లయినా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న కాషాయదళం సెప్టెంబర్ 17 ను ఒక అస్త్రంగా మలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో గులాబీ తోటలో కాషాయాన్ని వికసింపజేసేలా ప్రణాళికలు రచిస్తోంది. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమై 75 ఏండ్లు పూర్తికావస్తున్న తరుణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ తరహాలో తెలంగాణ విముక్తి వేడుకలను నిర్వహించాలని డిసైడ్ అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు ఏడాది పాటు ఈ వేడుకలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా ఆనాటి పోరాట ఘట్టాలు, సామాజిక పరిస్థితులు, రాజకీయ, చారిత్రక పరిస్థితులను ప్రజలకు కండ్లకు కట్టినట్లు చూపించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది.
తెలంగాణ ప్రాంతంలోని పరకాల అమరధామం, బైరాన్ పల్లి పోరాట ఉదంతం వంటి అనేక ఘట్టాలను సాక్షాత్కరించేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. క్షేత్రస్థాయిలో నిర్వహించే ఈ వేడుకలకు బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించి వేడుకలను ఘనంగా చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వస్తున్న బీజేపీ.., 'తెలంగాణ విమోచన' అని కాకుండా 'తెలంగాణ విముక్తి' దినోత్సవంగా పిలవాలని నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్న ఈ ప్రత్యేక వేడుకలతో పాటు ప్రజా సమస్యలపై కూడా ఫోకస్ చేస్తూ సంస్థాగతంగా బలోపేతం కావడంతో పాటు అధికారంలోకి రావాల్సిన అంశాలపై బీజేపీ దృష్టిసారించనుంది. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా తొలిఏడాది నుంచే ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామనే హామీతో ప్రజల్లోకి వెళ్లేలా కాషాయదళం ప్లాన్ చేస్తోంది.
గతేడాది సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని నిర్మల్‌లో బీజేపీ నిర్వహించిన సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. గతంలో అప్పటి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈసారి ఏడాదిపాటు నిర్వహించనున్న తెలంగాణ విముక్తి వేడుకల ప్రారంభోత్సవానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రంలోని కీలక నేతలను ఆహ్వానించాలని బీజపీ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఉత్సవాల ముగింపునాటికి ఎలక్షన్ టైం కూడా దగ్గరపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకల ముగింపు సభకు ప్రధాని మోడీని కూడా ఆహ్వానించి.. లబ్ధి పొందాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.