- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆమె జుట్టే.. పిట్ట గూడు.. వైరల్ అవుతున్న వీడియో
2013లో వీసా సమస్యలతో పని లేకుండా ఖాళీగా ఉన్న 'హన్నా బోర్న్ టేలర్'.. ఆ సమయంలో ప్రకృతితో మమేకమైంది. ఈ క్రమంలోనే పక్షుల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. బర్డ్స్‌కు సంబంధించిన ఒక్కో స్పెషల్ క్వాలిటీ.. వాటిపై ఆమె ప్రేమ పెంచుకునేలా చేశాయి. ఇదిలా ఉంటే 2018లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ తుఫాన్.. తనకు ఓ ప్రత్యేక బంధాన్ని పరిచయం చేసింది. గాలి దుమారం కారణంగా చెట్టుమీది గూడు చెదిరిపోయి తుదిశ్వాస తో పోరాడుతున్న ఓ పక్షి తన కంటపడటంతో చేరదీసింది. దానికి వెచ్చదనాన్ని కల్పించేందుకు ఓ కార్డుబోర్డులో తేయాకులు వేసి, గూడు మాదిరిగా ఏర్పాటుచేసి రక్షణ కల్పించింది. ఈ క్రమంలోనే పక్షికి హన్నా తల్లిగా మారగా.. రోజులు గడిచే కొద్దీ ఆ పిట్ట(ఫించ్) తన వెంట్రుకలనే గూడుగా మార్చేసుకుందని చెప్పింది.
ఇలా ఏకంగా 84 రోజుల పాటు తన జుట్టులోనే జీవించడంతో వీరిద్దరి బంధం దృఢంగా మారిపోయింది. అయితే క్రిస్మస్ టైమ్‌లో ఆ పక్షికి సంబంధించిన గుంపు తిరిగిరావడంతో తనను విడిచిపెట్టానని.. తను సరిగ్గా బతకగలదని, ఎగిరే శక్తి ఉందని తెలిశాకే ఇందుకు నిర్ణయించుకున్నానని చెప్పింది.