'ఆర్ఆర్ఆర్' నుంచి అదిరిపోయే అప్‌డేట్.. రెండో పార్ట్‌ పక్కా: విజయేంద్ర ప్రసాద్

by S Gopi |   ( Updated:2022-04-03 11:59:47.0  )
ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. రెండో పార్ట్‌ పక్కా: విజయేంద్ర ప్రసాద్
X

దిశ, సినిమా: ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కలయికలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' బాక్సాఫీస్‌ రికార్డులు బద్ధలు కొడుతోంది. ఇప్పటికే రూ.700 కోట్లు కొల్లగొట్టి రూ. 1000 కోట్ల దిశగా దూసుకుపోతున్న సినిమా నుంచి మరో బిగ్‌ అప్‌డేట్ వచ్చేసింది. చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు వీరులు కలిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు తెర రూపమిచ్చిన జక్కన్న.. తన ఫిక్షనల్ స్టోరీతో వరల్డ్ వైడ్ ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేశాడు. ఈ క్రమంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆర్‌ఆర్‌ఆర్'కు 'బాహుబలి' మాదిరే సీక్వెల్ ఉంటుందా? అనే డిస్కషన్స్ సోషల్ మీడియాలో ఊపందుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చర్చలు, సందేహాలకు రైటర్ విజయేంద్ర ప్రసాద్ తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

'సినిమా రిలీజ్‌కు ముందే ఎన్టీఆర్ ఓ రోజు మా ఇంటికొBigg Update from 'RRR'. Vijayendra Prasad clarified on the second partచ్చి 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ గురించి చర్చించాడు. స్టోరీ ఎలా ప్లాన్ చేయబోతున్నారంటూ వివరాలు అడిగేందుకు ప్రయత్నించాడు. నేను కూడా కొన్ని సూచనలు చేశాను. దైవానుగ్రహం ఉంటే సీక్వెల్ తప్పకుండా వస్తుంది' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీన్నిబట్టి చూస్తే.. రెండో పార్ట్ కచ్చితంగా ఉండబోతుందన్న చర్చ సినీ అభిమానుల్లో మొదలైంది.

ఇవి కూడా చదవండి : కెమెరా కోసమే పుట్టిన నటుడు.. ఆ ఒక్క పాటతో అందనంత ఎత్తుకు

Advertisement

Next Story