Priyanka Singh : బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-10-22 06:48:39.0  )
Priyanka Singh : బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ (Priyanka Singh) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తండ్రి బీబీ సింగ్ (Bibi Singh)చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఈ విషయాన్ని ప్రియాంక తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘మిస్ యూ నాన్న. రెస్ట్ ఇన్ పీస్’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ ప్రియాంక(Priyanka Singh) పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

కాగా, ట్రాన్స్ జెండర్ అయిన సాయి తేజ జబర్దస్త్ షో ( Jabardasth Show) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొంతకాలంగా తర్వాత లింగ మార్పిడీ చేయించుకుని పూర్తిగా అమ్మాయిగా మారాడు. ప్రియాంక సింగ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బిగ్‌బాస్ సీజన్-5 (BiggBoss Season-5) లో పాల్గొని ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. పలు టీవీ షోస్, స్పెషల్ ప్రోగామ్స్‌లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెడుతోంది.

Advertisement

Next Story

Most Viewed