Bigg Boss 8 Telugu Promo: ప్రేరణ vs హరితేజ.. నామినేషన్స్‌లో ఆగని మాటల యుద్ధం..!!

by Anjali |
Bigg Boss 8 Telugu Promo: ప్రేరణ vs హరితేజ.. నామినేషన్స్‌లో ఆగని మాటల యుద్ధం..!!
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున(Nagarjuna) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 (Bigg Boss Season-8) వేడివేడిగా సాగుతోంది. నిన్న (నవంబరు 2) లేడీ కంటెస్టెంట్ నయని పావని(Nayani Pavani) ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేట్ అయ్యాక ఈ కంటెస్టెంట్ హౌస్‌లోని కంటెస్టెంట్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే మరో వారం నామినేషన్స్ కు ముహూర్తం కూడా వచ్చేసింది. సాధారణంగా అయితే నామినేషన్స్ విషయంలో ఒక కంటెస్టెంట్ నచ్చని కంటెస్టెంట్లను ఇద్దర్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. తాజాగా జరిగిన నామినేషన్స్ లో ప్రేరణ(Prēraṇa) హైలెట్ గా నిలిచింది. ముందుగా గంగవ్వ(Gaṅgavva)ను నచ్చని కంటెస్టెంట్ ను నామినేట్ చేయమని అంటాడు బిగ్ బాస్. దీంతో గంగవ్వ సీరియస్ గా నిలబడి చూస్తుంటుంది. హౌస్ లో కంటెస్టెంట్లంతా పగలబడి నవ్వుతారు. గంగవ్వ.. యష్మీని నామినేట్ చేస్తుంది. అందుకు కారణం కూడా చెబుతుంది.

తర్వాత విష్ణుప్రియ(Vishnu Priya).. ప్రేరణను నామినేట్ చేస్తుంది. నామినేట్ చేయడానికి రీజన్ కేవలం కోపం మాత్రమే అని చెబుతుంది విష్ణుప్రియ. అలాగే గత కొన్నిరోజులుగా హరితేజ అండ్ ప్రేరణ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నామినేషన్స్‌లో కూడా అదే జరిగింది. క్యారెక్టర్‌ను నిర్ణయించినట్లుగా మాట్లాడటం తనకు ఏమాత్రం నచ్చలేదని ప్రేరణ.. హరితేజను నామినేట్ చేస్తుంది. ఫేక్ ఫేస్ అనడం నచ్చక అటాక్ చేశాను తప్పా..? అటాక్ మొదలుపెట్టింది మీరే అంటుంది. దీనికి హరితేజ(Hariteja) అస్సలు అంగీకరించదు. మీ ప్రయాణమే ఇంతంటూ ప్రేరణ వ్యంగ్యంగా మాట్లాడుతుంది. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇద్దరు తగ్గకుండా నామినేషన్స్ లో గొడవ పడుతుంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story