Bigg Boss 8 Telugu: నిజాలు బయటపెడితే నాగర్జునపైనే చిరాకు పడ్డ యష్మీ..?

by Anjali |
Bigg Boss 8 Telugu: నిజాలు బయటపెడితే నాగర్జునపైనే చిరాకు పడ్డ యష్మీ..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ వీక్ హోస్ట్ నాగార్జున(Nagarjuna).. కంటెస్టెంట్ల తప్పుల్ని చెప్పి కడిగిపారేస్తారన్న విషయం తెలిసిందే. కానీ ఈ వారం నాగార్జున ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు. ఒక్కటి, రెండు తప్పుల్ని మాత్రమే చూపించి కూల్‌గా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా బిగ్ బాస్(Big Boss) హౌస్‌లోని కంటెస్టెంట్ల సీక్రెట్స్‌ను బయటికి తీసి బిగ్ బాస్ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ బిగ్ బాస్ సీజన్-8 వీకెంట్స్ ఎపిసోడ్స్ జనాలకు కూడా పెద్దగా అర్థం కాకుండా కన్ఫూజ్‌గా మారుతున్నాయి. దీంతో ఆడియన్స్ విపరీతంగా ట్రోలింగ్(trolling) చేస్తున్నారు. ఎందుకంటే కంటెస్టెంట్ల గురించి అలా చూపించడం సరైంది కాదని అంటున్నారు. అలా చేస్తే వారి పరువు పోదా? అని పలువురు జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే .. ఈ వారం లేడీ కంటెస్టెంట్ యష్మీ(Yashmi) నాగార్జున మీద చికాకు పడింది.

గౌతమ్(Gautham) అండ్ యష్మీకి బిగ్‌బాస్ హౌస్‌లో టాస్క్‌లో భాగంగా చిన్న చిన్న వివాదాలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి యష్మీ.. గౌతమ్ పై కాస్త కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ వల్లనే ఓడిపోయానని అనడం అతడిపై బురదజల్లే ప్రయత్నం చేసింది. అలాగే ఎల్లో కార్డు మీ టీంకు ఇస్తామని, గౌతమ్ ను తీసేయాలంటూ నిఖిల్.. యష్మీని గదిలోకి పిలిచి మరీ చెప్తాడు. ఇక జ్యూస్ టాస్క్ విషయంలో నాగార్జున ఇలా మాట్లాడుతాడు. గౌతమ్ విషయంలో నిఖిల్(Nikhil), యష్మీని మ్యానుపులేట్ చేశాడని జ్యూస్ ఇచ్చిందని అంటాడు. దీంతో యష్మీ వెంటనే అయ్యే లేదు సార్ దయచేసి మీరు అలా అనకండి అనగా.. ఏమో పృథ్వీ కూడా అలాగే అంటున్నాడుగా అని కింగ్ అంటాడు. ఇక యష్మీ చికాకు పడుతూ ఏంటి నిజమా అంటుంది. వాస్తవాలు బయటపెడితే హోస్ట్ నాగార్జునుపైనే చిరాకు పడుతూ మాట్లాడుతుందా? అంటూ ఆడియన్స్ యష్మీపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story