Pushpa-2 నుంచి బిగ్ అప్డేట్.. ఈ సారి బన్నీకి చెమటలు పట్టడం ఖయమా?

by Hamsa |   ( Updated:2024-11-11 12:08:19.0  )
Pushpa-2 నుంచి బిగ్ అప్డేట్.. ఈ సారి బన్నీకి చెమటలు పట్టడం ఖయమా?
X

దిశ, సినిమా: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) నటిస్తున్న ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ‘పుష్ప-2 ది రూల్‌’(Pushpa-2 The Rule). ఈ చిత్రానికి బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని(Naveen Erneni), యలమంచిలి రవిశంకర్‌(Ravi Shankar) ఈ ప్రెస్టేజియస్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

ఈ క్రమంలో అందరి దృష్టి స్పెషల్ సాంగ్‌పై పడింది. ఇందులో ఎవరు నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మాసివ్‌ ‘కిస్సిక్‌’(kissick) సాంగ్‌ కోసం డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల(Sreeleela)ను ఎంపిక చేసుకున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం శ్రీలీల ఫస్ట్ లుక్‌(First Look)ను షేర్ చేశారు. కిస్సిక్ సాంగ్‌తో డాన్సింగ్ క్వీన్(Dancing Queen) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అదిరిపోయే పోస్టర్‌ను వదిలారు. ప్రజెంట్ శ్రీలీల లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక అది చూసిన వారంతా బన్నీకి చెమటలు పట్టడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story