- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్కినేని ఫ్యాన్స్‌కి బిగ్ షాక్..! పెళ్లికి ముందే ఆ విషయంలో గొడవ పడుతున్న నాగ చైతన్య- శోభిత..?
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున X వేదికగా ప్రకటిస్తూ వీరిద్దరి ఫొటోలు షేర్ చేశాడు. కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో అక్కినేని అభిమానులు చై- శోభితల మ్యారేజ్ న్యూస్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఈ క్రమంలో రీసెంట్‌గా శోభిత పసుపు దంచుట కార్యక్రమం అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేయడంతో అక్టోబర్ చివరి వారంలో వీరి పెళ్లి జరగనున్నట్లు అంతా ఫిక్స్ అయిపోయారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, శోభిత- నాగచైతన్యకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీరిద్దరూ పెళ్లి కాకుండానే గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది. ఏంటి కొత్త జంట పెళ్లి కాకుండానే గొడవలు పడుతున్నారా అని అంటే అవుననే చెప్పాలి. మరి ఇంతకీ అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల మధ్య గొడవలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే.. నాగచైతన్య పెళ్లి అయ్యాక సమంత- నాగచైతన్య ఇద్దరు ఎంతో ప్రేమగా కొనుక్కున్న ఆ ఇంట్లో కాపురం ఉందామని శోభితకి చెప్పారట. కానీ శోభిత మాత్రం అది నువ్వు నీ మాజీ భార్య కోసం స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న ఇల్లు. నేను అందులో ఉండను. నీతో ఆ ఇంట్లో ఉంటే నీకు అన్ని నీ మాజీ భార్య జ్ఞాపకాలే గుర్తుకు వస్తాయి.
ఇక మనిద్దరం ఎక్కడ సంతోషంగా ఉంటామని, ఆ ఇంట్లో ఉండటం వద్దని చెప్పిందట. కానీ నాగచైతన్య మాత్రం నేను ఆ ఫ్లాట్‌ని ఎంతో ప్రేమగా నాకు నచ్చిన విధంగా డిజైన్ చేయించుకున్నాను. మనం ఆ ఇంట్లోనే కొత్త కాపురం పెడదాం అని చెప్పారట. దీంతో ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. కానీ వీరిద్దరి మధ్య నాగార్జున సంధి కుదిర్చారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.