Darshan : కన్నడ స్టార్ నటుడికి బిగ్ రిలీఫ్

by M.Rajitha |
Darshan : కన్నడ స్టార్ నటుడికి బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ స్టార్ట్ నటుడు దర్శన్(Kannada Actor Darshan) కు బిగ్ రిలీఫ్ లభించింది. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసు(Renukaswamy Murder Case)లో అరెస్టయిన నటుడు దర్శన్ కు కర్ణాటక హైకోర్ట్(Karnataka High Court) బెయిల్ మంజూరు చేసింది. దర్శన్ తోపాటు ఆయన ఫ్రెండ్ పవిత్ర గౌడ(Pavitra Gouda), మరో ఏడుగురికి బెయిల్ దొరికింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జూన్ 11న దర్శన్, పవిత్ర గౌడ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. తన ఫ్రెండ్ పవిత్ర గౌడకు బెదిరింపు మెసేజెస్ చేస్తున్నాడానే కోపంతో రేణుకాస్వామిని దర్శన్ హత్య చేశారు. ఈ వ్యవహారంలో దర్శన్, పవిత్రతో పాటు మరో 15 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటికే తాత్కాలిక బెయిల్ మీద బయటికి వచ్చిన దర్శన్.. రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, నేడు కోర్ట్ మంజూరు చేసింది.

Advertisement

Next Story