నగ్నంగా గుర్రపు స్వారీ చేసిన సింగర్.. అందమైన ప్రయాణమంటూ

by sudharani |
నగ్నంగా గుర్రపు స్వారీ చేసిన సింగర్.. అందమైన ప్రయాణమంటూ
X

దిశ, సినిమా : అమెరికన్ సింగర్ బెయోన్స్ అర్థనగ్న ప్రదర్శనతో నెట్టింట సెగలు రేపింది. పాటలతోనే కాక ఫ్యాషన్ షో ద్వారా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ.. నిత్యం సరికొత్త అవతారంలో అభిమానులను అలరిస్తోంది. ఇదే క్రమంలో తన 'సెవంత్ సోలో' ఆల్బమ్ కవర్‌ పేజీ సంబంధిత ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. ఇందులో పూర్తి నగ్నంగా దర్శనమిచ్చిన సింగర్.. గుర్రంపై స్వారీ చేస్తూ విభిన్న యాంగిల్స్‌లో పోజులిచ్చింది. అంతేకాదు 'ఈ భయానక ప్రపంచాన్ని తప్పించుకుని కలలు కనేందుకు ఆల్బమ్‌లో చోటు లభించింది. ఇది కొంచెం సాహసోపేతంగా అనిపించినా నాకు స్వేచ్ఛనిచ్చింది. ఇది గొప్పగా ఆలోచించడానికి, గట్టిగా కేకలు వేయడానికి, సురక్షిత స్థలమని నా ఉద్దేశ్యం. ఒక అందమైన ప్రయాణం. నా సంగీతం, సెక్సీ ఫిగర్‌తో మరింత ఆనందాన్ని పొందుతారని ఆశిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై నెటిజన్లు బోల్డ్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

Advertisement

Next Story