శృంగారం చేస్తే ఇన్ని లాభాలా..? అవేంటో తెలిస్తే మీరు కూడా ప్రతిరోజూ..

by S Gopi |   ( Updated:2023-08-15 06:21:57.0  )
శృంగారం చేస్తే ఇన్ని లాభాలా..? అవేంటో తెలిస్తే మీరు కూడా ప్రతిరోజూ..
X

దిశ, వెబ్ డెస్క్: శృంగారం... దీని ప్రాముఖ్యత చాలామందికి తెలియదు. శృంగారం అంటే చాలామంది అదో భూతు పదంలా చూస్తారు. శృంగారమనే దానికి అసలైన అర్థం ఏమిటి.. అసలు శృంగారం అంటే ఏమిటో చాలామందికి ఇప్పటికీ తెలియదు. అంతేకాదు.. శృంగారం ఎందుకు చేస్తారు.. శృంగారం చేస్తే ఎన్ని లాభాలుంటాయో తెలియదు.

అయితే, ఈ విషయంలో పలువురు వైద్య నిపుణులు, ప్రముఖులు చెబుతున్నదేమిటంటే.. 'శృంగారం అనేది పవిత్ర కార్యం. శృంగారాన్ని సంభోగమని కూడా అంటారు. శృంగారం జీవుల సృష్టికి తొలిమెట్టు. శృంగారం ప్రతి ప్రాణి జన్మ హక్కు. భారతదేశంలోని కట్టుబాట్ల ప్రకారం స్త్రీ పురుషులు భార్యా భర్తలుగా మారిన తర్వాత మాత్రమే సంభోగంలో పాల్గొనాలి. అయితే, ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనాలి.. అలా పాల్గొంటే ఎన్నో ప్రయోజనాలు దరి చేరుతాయి. శంగారం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గడం, ప్రశాంతత ఏర్పడడం, రక్తపోటును తగ్గించడం, రోగనిరోధకశక్తి పెరగడం, వాసన గ్రాహక శక్తి పెరగడం, ప్రొస్ర్టేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అవ్వడం లాంటి ఆరోగ్యపరమైన లాభాలు ఉంటాయి. శృంగారం వల్ల ఏర్పడే దగ్గరితనం, భార్యాభర్తల్లో అన్యోన్నత, భావప్రాప్తులు, సంభోగ సమయంలో పెరిగే ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్ల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఉంటాయి' అని చెబుతున్నారు.

అదేవిధంగా.. 'తలనొప్పి, ఆందోళన, ఒత్తిడి, ఇతర రోగాలు కూడా దరి చేరవు. శృంగారం వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. గుండె జబ్బులు కూడా రావు. వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తుంది. అందుకే.. ముందురోజు రాత్రి శృంగారంలో పాల్గొన్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు చేసే ప్రసంగాలు మిగతవారితో పోలిస్తే ప్రభావవంతంగా ఉంటాయి. రసాస్వాదన వేళలో విడుదలయ్యే ఎండార్ఫిన్లకు నొప్పులను నివారించే శక్తి ఉంటుంది. ఒకసారి శృంగారంలో పాల్గొన్నారంటే ఒక కిలోమీటర్ దూరం వేగంగా పరిగెత్తినట్టే' అని వారు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed