Mandukasana Yoga: మండూకాసనం.. దీని వల్ల ఉపయోగమేంటో తెలుసా?

by Manoj |
Benefits Of Mandukasana Yoga
X

దిశ, ఫీచర్స్: Benefits Of Mandukasana Yoga| మొదటగా వజ్రాసనంలో కూర్చోవాలి. ఒక ఇరవైసార్లు పొట్ట నిండా గాలి పీల్చుతూ వదలాలి. తర్వాత రెండు చేతుల పిడికిళ్లు బిగించాలి. ఇప్పుడు కడుపులోని గాలి మొత్తాన్ని బయటకు పంపించి, బిగించిన పిడికిళ్లను బొడ్డుపై పెట్టి పొట్టను లోపలికి నెట్టాలి. అలాగే గాలీ పీల్చకుండా శరీరాన్ని ముందుకు వంచుతూ తలను మోకాళ్లపై ఆన్చాలి. ఇలా చేసిన తర్వాత కాస్త రిలాక్స్ అవ్వాలి. తర్వాత వజ్రాసనంలో కూర్చుని పిడికిళ్లు వదిలేసి అరచేతులతో బొడ్డు పైభాగంలో పొట్టను ఒత్తిడి చేస్తూ చేయాలి. ఇలా సాధ్యమైనంత సేపు చేశాక పూర్వ స్థితిలో విశ్రాంతి తీసుకోవాలి.

ప్రయోజనాలేంటి?

* ఉదర అవయవాలకు మేలు చేస్తుంది.

* మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగం.

* వీపును సాగదీయడంలో సాయపడుతుంది.

* గ్యాస్ సమస్యలు తగ్గించడంలో కీ రోల్.



Next Story