- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kanche Ilaiah: తిరుమల వెంకన్న, పద్మావతికి చదువొచ్చా.. మరోసారి కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పదునైన మాటలతో వార్తల్లో నిలిచే ప్రొఫెసర్ కంచె ఐలయ్య (Professor Kanche Ilaiah) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా తిరుమల వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District)లోని గుడూరు (Gudur)లో దొడ్డి కొమ్మరయ్య (Doddi Komaraiah) విగ్రహావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా వర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ (Chakali Ailamma) పేరును పెట్టడం తప్పేమీ కాదని కామెంట్ చేశారు.
తిరుమల వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మ వారికి ఏమైనా చదువు వచ్చా.. యూనివర్సిటీలకు దేవుళ్ల పేర్లను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. చాకలి ఐలమ్మ (Chakali Ailamma) ఓ వీర యోధురాలని.. బట్టలు ఉతికి సమాజాన్ని శుద్ధి చేసిందని కంచె ఐలయ్య కామెంట్ చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. కాగా, గతంలో ఆయన ఆర్య, వైశ్యులను ఉద్దేశించి రాసిన ‘సామజిక స్మగ్లర్లు.. కోమటోళ్లు’ అనే పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.