Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ ఈజ్ బ్యాక్.. రస్టిక్ లుక్‌లో దర్శనమిచ్చిన హీరో

by sudharani |
Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ ఈజ్ బ్యాక్.. రస్టిక్ లుక్‌లో దర్శనమిచ్చిన హీరో
X

దిశ, సినిమా: టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) ‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక మొదటి మూవీతోనే మంచి హిట్ అందుకున్న ఈ హీరో స్టార్ హీరోగా దూసుకుపోతాడు అనుకున్నారు అంతా. కానీ తర్వాత వచ్చిన ఏ చిత్రం అంతా హిట్ ఇవ్వలేదు. ఇక పాన్ ఇండియా స్టార్ (Pan India Star) ప్రభాస్ (Prabhas) నటించిన ‘ఛత్రపతి’ సినిమా రీమేక్‌తో హిందీ (Hindi)లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ కూడా డిజాస్టర్ (disaster)గా నిలిచింది. ప్రజెంట్ ఈ హీరో ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర (Sagar K. Chandra) దర్శకత్వం వహిస్తున్నాడు. 14 రీల్స్ (14 Reels) ప్లస్ పతాకంపై రామ్ ఆచంట (Ram Chanta), గోపి ఆచంట (Gopi Achanta) నిర్మిస్తున్న ఈ మూవీ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో 10వ చిత్రంగా రూపొందుతుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన హీరో ఫస్ట్ లుక్ (First Look) పోస్టర్ (poster), గ్లింప్స్ (glimpse) ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ‘టైసన్ నాయుడు’ కోసం శ్రీనివాస్ తన లుక్ మొత్తాన్ని మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా దీపావళి (Diwali) స్పెషల్ (Special)గా ఓ పిక్ షేర్ చేశాడు. అందులో గుబురు గడ్డంతో రస్టిక్ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాడు. ప్రజెంట్ ఆ పిక్ వైరల్ కావడంతో.. ‘బెల్లంకొండ ఈజ్ బ్యాక్.. ఈ సారి హిట్ పక్కా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story