- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్కార్ దవాఖాన్లలో బెడ్క్లీనింగ్కు భారీగా పెరిగిన ధర
దిశ, తెలంగాణ బ్యూరో : సర్కార్ దవాఖాన్లను క్లీన్చేసేందుకు ప్రభుత్వం పారిశుద్ధ్య ఖర్చును పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కో బెడ్‌కు ప్రస్తుతం ఉన్న పారిశుద్ధ్య ఖర్చును రూ.5 వేల నుంచి 7,500లకు పెంచారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్లీనింగ్‌ను "ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్" పాలసీని పేరిట నిర్వహించనున్నారు. పెరిగిన ఖర్చుల కేటాయింపులను నర్సింగ్ కాలేజీలు, స్కూళ్లకూ వర్తింపజేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో పాటు గత ఏడాది నమోదైన బెడ్ ఆక్యుపెన్సీ , మంజూరైన పడకల సంఖ్యలో 50% రికనబుల్ బెడ్ స్ట్రెంత్ నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ప్రతి 7000 స్క్వేర్ ఫీట్ల బిల్డప్ ఏరియాకు ఒకరిని, ఓపెన్ ఏరియా అయితే 27,000 స్క్వేర్ ఫీట్ కు ఒకరు చొప్పున నియమించే విధానం ఉన్నది. అయితే 200 పై పడకల ఉన్న దవాఖానకు ప్రత్యేకంగా టెండర్లు పిలవనున్నారు. 200లోపు పడకలు ఉన్న హాస్పిటళ్లకు వీలైనంత వరకు కలిపి టెండర్లు పిలవాల్సిన అవసరం ఉన్నదని సెక్రటరీ సూచించారు.
కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ టెండర్లను పిలిచి ఎంపిక చేయాలని ఆదేశాలిచ్చారు. జిల్లా ఆరోగ్య సంఘం ఐహెచ్ఎఫ్ఎమ్ఎస్ఏజెన్సీతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నది. పారిశుద్ధ్యానికి సంబంధించిన అత్యున్నత ప్రమాణాలను పాటించేలా కార్మికులకు నైపుణ్యం పెంపుదలలో ఆరోగ్య శాఖ, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ట్రైనింగ్, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.