Bigg Boss - 8: బిగ్‌బాస్‌లో బతుకమ్మ సంబురాలు.. అబ్బాయిలు అమ్మాయిలను ఎత్తుకొని..

by Anjali |
Bigg Boss - 8: బిగ్‌బాస్‌లో బతుకమ్మ సంబురాలు.. అబ్బాయిలు అమ్మాయిలను ఎత్తుకొని..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 ఆరోవారం చివరకు వచ్చింది. కంటెస్టెంట్లంతా తెలుగు ప్రేక్షకుల్ని ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలంతా బతుకమ్మ పండుగ జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్.. హౌస్‌లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న వారితో కూడా బతుకమ్మ ఆడించారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ఆకట్టుకుంటోంది. హౌస్‌మేట్స్ అంతా సంప్రదాయంగా పట్టు వస్ట్రాలు ధరించి.. తళతళ మెరిసిపోయారు. ఈ ప్రోమోలో కామెడీ స్కిట్లు, గేమ్స్, డ్యాన్సులు చేస్తూ దసరాను హౌస్ లో ఫుల్ ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు.

శ్రీను వైట్ల దర్వకత్వంలో వచ్చిన కింగ్ చిత్రం జ్ఞాపకాలను కంటెస్టెంట్లు గుర్తు చేసుకున్నారు.అమ్మాయిలను అబ్బాయిలు ఉప్పు బస్తాలుగా ఎత్తుకోనే టాస్క్ కూడా బిగ్‌బాస్ నిర్వహించాడు. పాటను బట్టి దానిలో ఉన్న వస్తువులను తీసుకురావాలి. ఇక టాస్కులు కంప్లీట్ అయ్యాక చివరకు ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ప్రేక్షకులకు మరింత ఊపునిచ్చే విషయం ఏంటంటే.. ఫరియా అబ్దుల్లా, డింపుల్ హయతి, అమృతా అయ్యర్ స్పెషల్ డ్యాన్స్ ఫర్ఫామెన్స్ లు ఇచ్చారు. పూర్తి ఎపిసోడ్ నేడు రాత్రి రాబోతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed