- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ ఎఫెక్ట్.. 'వారికి న్యాయం జరిగే వరకూ పోరాడుతాం' : కాంగ్రెస్ నేత
దిశ ప్రతినిధి, వరంగల్ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామంలోని భూ దాన్ భూముల కబ్జా వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ శుక్రవారం జాతీయ ఎస్సీ కమిషన్‌గాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఆయన ఈ నెల 25వ తేదీన దిశ మొదటి పేజిలో వచ్చిన 'గుట్టను మింగిన ఘనులు' కథనానికి సంబంధించి పేపర్ క్లిప్పులను కూడా ఆధారంగా జత చేయడం గమనార్హం.
ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గిరిజనులు, దళితులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు దశాబ్దాల క్రితం భూ దాన్ యజ్ఞం బోర్డు ద్వారా స్థానికులకు అందజేసిన భూములను కొంతమంది అధికార పార్టీకి చెందిన వారిని కూడబలుక్కుని కబ్జా చేశారని అన్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులు కూడా సహకరించినట్లుగా స్పష్టమవుతోందని చెప్పారు. మేకలగట్టు భూ దాన్ భూములకు సంబంధించిన రికార్డులు రెవెన్యూ అధికారుల వద్ద లేకపోవడం దారుణమని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరుఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.