FLASH: రేవ్ పార్టీ ఎఫెక్ట్: బంజారాహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు

by GSrikanth |
FLASH: రేవ్ పార్టీ ఎఫెక్ట్: బంజారాహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు బంజారాహిల్స్ సీఐ శివచంద్రను ఉన్నతాధికారులు సస్సెండ్ చేశారు. అంతేగాక, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్‌కు చార్జ్‌మెమో జారీ చేశారు. పుడింగ్ పబ్‌లో విచ్చల విడిగా డ్రగ్స్ వాడుతుండటంతో, పక్కా రెక్కీ నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడులు చేశారు. కొకైన్ తీసుకుంటున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు మఫ్టీలో వెళ్లారు. పోలీసులను చూసిన మత్తుగాళ్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. దాడుల అనంతరం మేనేజర్‌ను పబ్‌కు తీసుకెళ్లిన పోలీసులు, భారీ డ్రగ్స్ పార్టీ జరిగినట్లు అనుమానిస్తున్నారు. పబ్ యజమాని అభిషేక్ ఆప్పాలగా గుర్తించారు.

Advertisement

Next Story