చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్..

by Satheesh |
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్..
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న బంగ్లా.. అతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తు చేసి చరిత్రలో మొదటిసారిగా దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌ను గెల్చుకుంది. సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో.. బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో బంగ్లా.. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ విజయాన్ని నమోదు చేసి చరిత్ర తిరగరాసింది. ఈ సిరీస్‌కు ముందు మూడు సార్లు సౌతాఫ్రికాలో పర్యటించిన బంగ్లా.. మూడు సిరీస్‌లలో ఒక్క వన్డే కూడా గెలవకపోవడం గమనార్హం. ఏదేమైనా సౌతాఫ్రికా సొంత గడ్డపై బంగ్లాదేశ్ వారిని ఓడించడం మాత్రం సాధారణ విషయం కాదు.

Advertisement

Next Story